Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి...47 మంది సైనికులు మృతి 1 d ago
పాకిస్తాన్ సైన్యం పై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) భారీ ఆత్మాహుతి దాడికి విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారని ఇస్లామాబాద్ పేర్కొంది. బీఎల్ఏ 47 మంది సైనికులు చనిపోయారని తెలిపింది. ఈ దాడిలో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియా ద్వారా విస్తరించాయి. ఈ దాడి శనివారం బలోచిస్థాన్లోని తుర్బత్ వద్ద జరిగినట్లు గుర్తించారు.